తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంటింటికీ రూ.2,500: సీఎం జగన్
మిగ్జామ్ తుపాను కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ నేడు పర్యటించారు. తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెంలో ఆయన మాట్లాడుతూ, తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి రూ.2,500 ఇస్తారని వెల్లడించారు. పంట నష్టపోయిన వారు కూడా బాధపడాల్సిన పనిలేదని, ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో కార్యరూపం దాల్చుతాయని,...