నేను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పినా ర్యాగింగ్ చేశారు: ఎంపీ బైరెడ్డి శబరి
ఉమ్మడి కర్నూలు జిల్లా పూడిచర్లలో కార్యక్రమంఆసక్తికర అంశం వెల్లడించిన ఎంపీ శబరిజనసైనికులు గట్టివారన్న పవన్నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పవన్ కల్యాణ్ అభిమానుల గురించి ఆసక్తికర అంశం వెల్లడించారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో జరిగిన ఒక సభలో ఆమె మాట్లాడుతూ, తాను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు రాగింగ్ అనుభవం ఎదురైందని గుర్తు చేసుకున్నారు. "నేను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు, సీనియర్లు నా ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. నేను పవన్ కల్యాణ్ అని...