‘యానిమల్’ చూశాను… మతిపోయింది: డీటెయిల్ గా రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'యానిమల్' చిత్రం డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్త కథనంతో వచ్చిన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కాగా, ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. వివరణాత్మకంగా రివ్యూ ఇచ్చారు. "యానిమల్ చిత్రం చూశాను... మతిపోయిందంతే! సినీ మేధస్సుకు పరాకాష్ఠ ఈ చిత్రం. చిత్రబృందానికి అభినందనలు" అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.ఈ సినిమాలో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది కూడా అల్లు...