Addam News
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 2:55 am Posted by : Addam News

డ్రంక‌న్ డ్రైవ్ కేసులో 10 మంది అరెస్టు, ఒక‌రికి 3 రోజుల జైలు శిక్ష‌

హైదరాబాద్, అక్టోబ‌ర్ 7, అద్దం న్యూస్ : 

హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన డ్రంక‌న్ డ్రైవ్ కేసులో ప‌ది మందిలో 9 మందికి జ‌రిమానాతో పాటు ఒక వ్య‌క్తికి జ‌రిమానాతో పాటు 3 రోజుల జైలు శిక్ష‌ను నాంప‌ల్లి కోర్టు మంగ‌ళ‌వారం విధించిందని చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ కె.ఏడుకొండ‌లు తెలిపారు. డ్రంక‌న్ డ్రైవ్‌లో భాగంగా మంగ‌ళ‌వారం వాహ‌నాల‌ను త‌నిఖీ చేయ‌గా మ‌ద్యం తాగి వాహ‌నాల‌ను న‌డిపిన 10 మందిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచామ‌ని ఇన్‌స్పెక్ట‌ర్ కె.ఏడుకొండ‌లు తెలిపారు. అందులో ఒకరికి 3 రోజుల జైలు, 3100 రూపాయ‌ల జ‌రిమానా, మిగిలిన 9 మందికి ఒక్కోక్కరికి రూ.3100 ల చొప్పున కోర్టు జరిమానా విధించింద‌న్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png