జాతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్ 134 వ జయంతి
హైదరాబాద్, ఆగస్టు 12, అద్దం న్యూస్ : జాతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ఎస్.ఆర్.రంగనాథన్ 134 వ జయంతిని హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి శ్రీమతి పద్మజ లు హాజరై ఎస్.ఆర్.రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.