22 ఏ ఆంక్షలను తొలగించాలి
– బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా
హైదరాబాద్, సెప్టెంబర్ 3, ( అద్దం న్యూస్ ) : 22 ఏ ఆంక్షలను తొలగించాలని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా అన్నారు. కాంగ్రెస్ ‘ ఆరు గ్యారెంటీలు ’ పచ్చి మోసాల పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా , 22 ఏ నిషేధిత భూముల సమస్యపై హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం జరిగింది. గురువారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా మాట్లాడుతూ… ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఏళ్ల తరబడి హక్కులు ఉన్న సామాన్యుల ఆస్తులను, పూర్తి కాలనీలను 22-ఏ జాబితాలో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నోటి మాటలతో క్షమాపణ చెబితే సరిపోదని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులకు ఒక రూల్.. సీఎం, మంత్రులకు మరో రూలా అని ప్రశ్నిస్తూ, తప్పుగా చేర్చిన భూములన్నింటినీ ఎలాంటి దరఖాస్తులు లేకుండా వెంటనే తొలగించాలని కోరారు. 22-ఏ భూముల వివాదంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమగ్రంగా ఒక జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, దీని వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని కోరారు.
కేసీఆర్ పాలనలో రైతు బీమా అందించారని, రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇచ్చి ధీమా అందించడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ధీమా లేదు.. బీమా లేదని ఎద్దేవా చేశారు. రైతు బీమాను చిదిమేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, రైతుబంధు ఎగవేత, రుణమాఫీ సగానికి సగం కోత విధించిందన్నారు. వెయ్యి రోజుల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని, ఒక ఇటుక పెట్టలేదు, ఒక చెరువు కట్టలేదు, ఒక చెక్ డ్యాం కట్టలేదన్నారు. కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కటింగులు తప్ప వీళ్లు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, రేషం మల్లేష్, కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్, శంకర్ ముదిరాజ్, రెబ్బ రామారావు, సిరిగిరి శ్యామ్, కల్వగోపి, కరికె కిరణ్, జుగేందర్, బల్లెకరి రమేష్, ఎయిర్‌టెల్ రాజు, బల్లెకరి రాములు, శోభ, మణి, మేరి, కనక మహాలక్ష్మీ, ఉమారాణి, ముదిగొండ మురళీ, సత్యనారాయణ, హరీష్, రాకేష్, శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ధర్మ, దీన్ దయాల్, ముత్యం బాల్‌రాజ్‌గౌడ్, సదా, బలవంత్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply