Addam News
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 3:47 am Posted by : Addam News

జలమండలిలో 23 మంది ఉద్యోగులు పదవీ విరమణ

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) :

జలమండలి పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 23 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరిలో ఆపరేషన్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించిన వాస సత్యనారాయణ సహా.. పలు స్థాయుల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వీరందరిని ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యూటీ వంటి తదితర ప్రయోజనాలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎం సరస్వతి, ఉద్యోగులు పాల్గొన్నారు.