కాలిఫోర్నియాలో 30 మంది భారతీయుల అరెస్టు
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) పేర్కొంది. వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్లు, మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ (Donald...