Addam News
Newspaper Banner
Date of Publish : 16 July 2025, 11:02 pm Posted by : Addam News

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవలసిందే – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవలసిందే
ఆర్డినెన్స్‌ ముసాయిదాను రాష్ట్ర గవర్నర్ ఆమోదించాలి
బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

– ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్



హైదరాబాద్, జులై 16, అద్దం న్యూస్ :   బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు. హైదరాబాద్ లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయం నుండి బుధ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేశారు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తమ స్వార్థ‌పూరిత రాజకీయ కోణంలో ఆలోచించకుండా బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధితో ముందడుగు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదాను రాష్ట్ర గవర్నర్ ఆమోదించాలని, తదుపరి చట్టం తీసుకువచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే ఆమోదం పొందేలా రాష్ట్రంలోని బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేసారు. తమిళనాడు తరహా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9 వ షెడ్యూల్‌లో చేర్చాలని, అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలను అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png