అక్షరాల కోసం 45 రోజులుగా శ్రమ – ఉల్లాస్ పరీక్ష రాసిన లాలాపేట మహిళా సంఘాల సభ్యులు
తార్నాక, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) : వయసు చదువుకు అడ్డంకి కాదని లాలాపేటకు చెందిన మహిళా సంఘాల సభ్యులు చాటి చెప్పారు. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మధ్య 45 రోజుల పాటు రాత్రివేళల్లో అక్షరాలు నేర్చుకున్న మహిళలు ఆదివారం ఉల్లాస్ పరీక్షకు హాజరై తమ చదువు నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప్ నంబర్–6లో నిర్వహించిన పరీక్షను ఉత్సాహంగా రాశారు. మహిళా సంఘాల సభ్యుల్లో అక్షరాస్యత పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నూతన భారత...