Addam News
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 2:34 pm Posted by : Addam News

ముగిసిన 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘ‌నంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ పలని కదిరవన్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ హాజరయ్యారు. ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, అలాగే పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పలని కదిరవన్ మాట్లాడుతూ… విద్యార్థులు తమ లక్ష్యాల సాధన కోసం నిత్య సాధన చేయాలని, సమాజంలో ఒడిదుడుకులు సహజమన్నారు. కానీ లక్ష్యం చేరే వరకు నిత్యం నేర్చుకుంటూ ముందుకు సాగాలన్నారు. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ‌ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులకు లైబ్రరీల్లో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇంకా సమస్యలు ఉన్నట్లయితే వాటిని త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది చంద్రకళ, సుబ్బలక్ష్మి, ప్రతిభా రెడ్డి, మంజుల వాణి, సీతామాలక్ష్మి, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, రవీందర్ రెడ్డి, అవినాష్, రామ్మోహన్, బొల్లం మహేందర్, కృష్ణారెడ్డి, రమేష్, శ్రీనివాస్, జంగారెడ్డి, నరేందర్, మహేష్ గౌడ్, జానకి, రాములు, అశోక్, ముత్యం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీకాంత్, రాజేష్, మహేశ్వరి, అమరావతి, భాగ్య, సునీత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png