Addam News
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 4:49 pm Posted by : Addam News

డీజీపీ రేసులో 8 మంది  – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 8 మంది పేర్లను పంపిన రాష్ట్ర ప్రభుత్వం

 

డీజీపీ రేసులో 8 మంది 

– యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 8 మంది పేర్లను పంపిన రాష్ట్ర ప్రభుత్వం

 

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయ‌నున్నారు. ఈ నేప‌ధ్యంలో రాష్ట్రంలో నెక్స్ట్ ఎవ‌రు డిజిపిగా అనేది చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 8 మంది పేర్లను పంపింది. అందులో రవి గుప్తా (1990 బ్యాచ్), సీవీ ఆనంద్ (1991 బ్యాచ్), డా.జితేందర్ (1992 బ్యాచ్), ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్), కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్), బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్), డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్), శిఖా గోయల్ (1994 బ్యాచ్) ఉన్నారు. అర్హ‌త‌ల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లును సూచిస్తూ యూపీఎస్సీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇదిలా ఉండ‌గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 5న, రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ చేయ‌నున్నారు. అలాగే సీవీ ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్, బి.శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, డా. సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30, శిఖాగోయల్ 2029 మార్చి వరకు సర్వీస్ ఉంది. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర డిజిపిగా ఎవ‌ర‌నేది వేచి చూడాల్సి ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png