8 వేల మంది తాత్కాలిక గురుకుల ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలి -రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య

హైద‌రాబాద్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :      బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 8 వేల మంది తాత్కాలిక ఉపాధ్యాయులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బీసీ భవన్‌లో రాష్ట్ర తాత్కాలిక ఉద్యోగుల సంఘం సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ... గురుకుల ఉపాధ్యాయులకు విద్యార్హతలు, బోధనా అనుభవం, ఉత్తమ ఫలితాలు...