విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. విద్యా రంగంపై శాసనమండలిలో బుధవారం జరిగిన ప్రత్యేక చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. 2021 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో పేర్కొన్న గణాంకాలను సభలో వివరించారు. సబ్జెక్టుల వారిగా తెలంగాణలో ఏ స్థానానికి పడిపోయిందనేది తెలిపారు. ఏ సబ్జెక్టులోనూ...