సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ :    సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై వెంటనే సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ... సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీ పరిధి పాశం మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం జరిగిందన్నారు. ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని, ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణ,...