నేడు మ‌హా ర‌క్త‌దాన యజ్ఞం –సిటీ కమిషనరేట్ పరిధిలోని 37 కేంద్రాల్లో శిబిరాలు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) :      విధి నిర్వహణలో దేశం కోసం, సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల నిస్వార్థ త్యాగాలను స్మరిస్తూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29 వ తేదీన ( నేడు ) బృహత్తర మెగా రక్తదాన యజ్ఞం చేపడుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 37 ప్రాంతాల్లో, 28 ప్రముఖ బ్లడ్ బ్యాంకుల సహకారంతో ఈ శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు....