Addam News
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 3:38 am Posted by : Addam News

ఘనంగా శ్రీ సాయి రామ్ హై స్కూల్‌లో 2000–2001 ప‌ద‌వ త‌ర‌గ‌తి పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం

ఘనంగా శ్రీ సాయి రామ్ హై స్కూల్‌లో 2000–2001 ప‌ద‌వ త‌ర‌గ‌తి పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం

హైదరాబాద్, అక్టోబ‌ర్ 12, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజన్‌లో గ‌ల శ్రీ సాయి రామ్ హై స్కూల్‌లో 2000–2001 సంవ‌త్స‌రం 10 త‌ర‌గ‌తి విద్యార్థులు రజతోత్సవ సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ కపాల ప్రమీల, డైరెక్టర్ కపాల సిద్ధార్థ, ఉపాధ్యాయులు పవన్, సత్యనారాయణ, నాగరాణి, శ్రీధర్ ,శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులకు శాలువాల‌తో సత్కారం చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ప్రతి విద్యార్థి తన స్కూల్ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు విద్యార్థులు మాట్లాడుతూ…. మా భవిష్యత్తుకు పునాది ఈ పాఠశాల నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో రాణించి, ఆ రంగానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అన్నారు. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తమ గురువులను కలసి వారి ఆశీర్వాదాలు పొందడం పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాణి గౌడ్, సంతోష్ కుమార్, టి.శ్రీనివాస్, జి.శ్రీనివాస్, నిదీష్, గౌతమ్, సురేష్, ప్రనవానంద్, రవి శంకర్, జాన్సీ రాణి, అశ్విని షకీలా, సుచిత్ర, నిర్మల, సరిత, పుష్పాంజలి, స్వప్న, శ్రీ లక్ష్మి పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png