ప్రముఖ కవి డాక్టర్.అందెశ్రీకి ఘన నివాళి – రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ సభ
రవీంద్రభారతి, నవంబర్ 10, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ప్రజల హృదయాల్లో తనదైన కవిత్వంతో, పాటలతో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ కవి, గేయ రచయిత డాక్టర్.అందెశ్రీ స్మృతికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు డాక్టర్.జివి.వెన్నెల సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...