Addam News
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 12:25 pm Posted by : Addam News

డాక్ట‌ర్‌.మ‌హ్మ‌ద్ వ‌సీమ్ కు ఘ‌నంగా స‌న్మానం

డాక్ట‌ర్‌.మ‌హ్మ‌ద్ వ‌సీమ్ కు ఘ‌నంగా స‌న్మానం

హైదరాబాద్, డిసెంబ‌ర్ 29, అద్దం న్యూస్ :      ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బస్తీలో ప్రొ క్టీనిను ఏర్పాటు చేసి దిగ్విజ‌యంగా రెండు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా క్లీనిక్ నిర్వాహ‌కుడు డాక్ట‌ర్‌.మ‌హ్మ‌ద్ వ‌సీమ్ కు నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు సోమ‌వారం స‌న్మానం చేశారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారి, ఎండి.జావీద్ ఖాన్‌, జాఫర్, సమీర్ హుస్సేన్, ఇమ్రాన్ ఖురేషి, మహ్మద్ జునైద్ త‌దిత‌రులు డాక్ట‌ర్‌.మ‌హ్మ‌ద్ వ‌సీమ్‌కు శాలువాలు క‌ప్పి, గ‌జ‌మాల వేసి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారి, ఎండి.జావీద్ ఖాన్ మాట్లాడుతూ… డాక్ట‌ర్‌.మ‌హ్మ‌ద్ వసీమ్‌ ముషీరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు అంకితభావంతో, నిస్వార్థంగా, అత్యుత్తమ వైద్య సేవలను అంద‌చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png