ప్రవళిక మృతి చెందడం బాధాకరం – ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు, పది లక్షల ఎక్స్‌గ్రేషియ – మంత్రి పొన్నం ప్రభాకర్
ఉస్మానియా ఆసుపత్రి, నవంబర్ 4, ( అద్దం న్యూస్ ) : ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి పది రోజుల నుంచి చికిత్స పొందుతున్న కండక్టర్ ప్రవళిక బుధవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిని పరామర్శించి వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ...