పాత్రికేయునిగా అంతగా వెలుగు చూడని భగత్‌సింగ్‌ మరో కోణం – నేడు సర్దార్ భగత్‌సింగ్‌ జయంతి.

దేశ స్వాతంత్య్రం కోసం అలవోకగా ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేర్లు భగత్ సింగ్, శివరాం రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్ త్రయం. మనందరికీ తెలిసినట్లు భగత్‌సింగ్‌ ఒక ప్రసిద్ధ విప్లవకారుడు మాత్రమే కాదు, ఆయన ఒక బహుభాషా జర్నలిస్ట్ కూడా. ప్రజలను విప్లవ పంథా వైపు ప్రేరేపించే క్రమంలో బ్రిటిష్ అధికారుల అరెస్టు నుండి తప్పించుకోవడానికి ఆయన ‘ బల్వంత్ సింగ్ ’ వంటి మారుపేర్లతో విప్లవ సాహిత్యం రచించేవారు. పాత్రికేయునిగా అతని తొలి రచనలు చాలా వరకు బల్వంత్...