మతిస్థిమితం సరిగ్గా లేని యువతి మిస్సింగ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : మతిస్థిమితం సరిగ్గా లేని యువతి మిస్సింగ్ అయిన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ.నాగరాజు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.... ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ నాగమయ్యకుంటకు చెందిన చిలుక శంకర్ కు చిలుక సునీత ( 33 ) చెల్లె ఉంది. ఆమెకు మతిస్థిమితం సరిగ్గాలేదు. వివాహం కాలేదు. నాగమయ్యకుంట బస్తీ వద్ద భిక్షాటన చేస్తుంటుంది. ఇదిలా ఉండగా ఈ నెల 19వ తేదీన బయటకు వెళ్లిన సునీత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో చిలుక...