ఆరె కటికలకు 500 కోట్ల నిధులతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి – ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ కుమార్ దాదా
హైదరాబాద్, నవంబర్ 25, అద్దం న్యూస్ : ఆరె కటికలకు 500 కోట్ల నిధులతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, అంగళ్లలో తై బజార్‌ను రద్దు చేయాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ కుమార్ దాదా అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మంగళవారం ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ కుమార్ మాట్లాడుతూ... మా...