అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి – స్పీక‌ర్‌కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. యూనైటెట్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.... ఏప్రిల్ 11న పూలే జయంతికి ముందే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత...