Addam News
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 3:50 am Posted by : Addam News

వరద ముంపు బాధితులను పరామర్శించిన ఎ.వినయ్ కుమార్

వరద ముంపు బాధితులను పరామర్శించిన ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    గ‌త రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీ ముంపున‌కు గురైంది. విష‌యం తెలుసుకున్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో ముంపు బాధిత కుటుంబాల‌ను గురువారం ప‌రామ‌ర్శించారు. వరద వల్ల కొన్ని రాత్రి నుండి కనీసం అన్నం వండుకొని తినలేని పరిస్థితిలో ఉన్న కొన్ని కుటుంబాల సమస్యను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తో ప్రస్తావించి, కార్పొరేటర్ సూచనల మేరకు యుద్ధ ప్రాతిపదికన‌ చర్యల్లో భాగంగా స్థానిక శంకరమ్మ, లక్ష్మి, మధు తో పాటు సుమారు 30 కుటుంబాలకు భోజనాన్ని వినయ్ కుమార్ అందచేసారు. జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి వారి సిబ్బందితో వరద ముంపుకు గురైన ఇళ్ళల్లోని నీరును నాలాలోకి చేరే విధంగా పనులు ప్రారంభించి కొనసాగిస్తున్నారని విన‌య్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, శ్రీనివాస్ గౌడ్, సోను, పవన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png