ఆరె కటికలను బిసి ఏ లోకి చేర్చాలి
కాచిగూడ, అద్దం న్యూస్ : ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరె కటికలను ( బిసి డి ) గ్రూప్ నుంచి ( బిసి ఏ ) గ్రూపులోకి మార్చాలని ఆరె కటిక సంగ్ ఇసామియా బజార్ అధ్యక్షుడు హెచ్.రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నింబోలా అడ్డా ఏకే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో ఆరె కటికలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని వివరించారు. ఆరెక టికలకు ప్రత్యేక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని...