వైభవంగా మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్లో ఎన్టిఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఆదివారం తొమ్మిదవ రోజుకు చేరింది. ప్రదోష పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కల్యాణోత్సవాలు, కార్తీక దీపారాధన నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో కోటి దీపోత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ అలివేలుమంగా సార్వయ్య స్మార్థ వేదపాఠశాల, భద్రాచలం విద్యార్థుల వేదపఠనం జరిగింది. ప్రదోష వేళ ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ప్రదోష వ్రతాన్ని పురస్కరించుకుని నందీశ్వరునికి...