దోమ‌ల‌గూడ పూల్‌బాగ్‌లో ప్ర‌మాదం – నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం నుంచి ఇనుప రాడ్ ప‌డి మ‌హిళ త‌ల‌కు తీవ్ర గాయం –  ప‌ట్టించుకోని భ‌వ‌నం బిల్డ‌ర్‌, ఓన‌రు

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ దోమ‌ల‌గూడ పూల్‌బాగ్‌లో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో చిన్న పిల్ల‌లు ఆడుకునే ఊదురు పీక‌లు విక్ర‌యించే మ‌హిళ త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న వివ‌రాలు స్థానికులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.. దోమ‌లగూడ పూల్‌బాగ్‌లో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం కొన‌సాగుతుంది. ఇదిలా ఉండ‌గా మూడు రోజుల క్రితం చిన్న పిల్ల‌లు ఆడుకునే ఊదురు పీక‌లు త‌దిత‌ర...