హత్య కేసులో నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలించిన ముషీరాబాద్ పోలీసులు
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఇచ్చిన అప్పు తీర్చాలని వేధిస్తున్నాడని అప్పు ఇచ్చిన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... అల్వాల్‌కు చెందిన సత్నం సింగ్ (59) ఈనెల 4వ తేదీన ఉదయం ముషీరాబాద్ దేవి చౌక్ వద్ద ఉండే సోదరుని ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్తాను...