ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
తార్నాక, అక్టోబర్ 8, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ ) అధ్యక్షుడు మహేష్‌గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నినాదాలు...