Addam News
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 3:31 am Posted by : Addam News

భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఈఓ, సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి – తెలంగాణ కార్యనిర్వహణాధికారుల సంఘం

భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఈఓ, సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

– తెలంగాణ కార్యనిర్వహణాధికారుల సంఘం

హైదరాబాద్, జులై 9, అద్దం న్యూస్ :    భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి, ఆలయ సిబ్బందిపై దాడి చేసిన ఆలయ భూ అక్రమణదారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ కార్యనిర్వహణాధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.ఆంజనారెడ్డి, అధ్యక్షుడు ఎ.నరేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.మారుతి, ఉపాధ్యక్షుడు ఎం.సత్య చంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి కె.రాజేష్ కుమార్, ఎ.నాగేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈఓ, సిబ్బందిపై దాడిపట్ల సంఘం ప్రతినిధులు ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించారు. శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు పురుషోత్తపట్నం గ్రామం నందు ఉన్నాయని, చాలా కాలం నుండి అక్రమణలకు గురికావడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఎండోమెంట్ ట్రిబునల్ లో అక్రమణలను తొలగించుటకు కేసు వేయగా గౌరవ న్యాయస్థానం అక్రమణలు తొలగించుటకు ఆదేశాలు జారి చేసిందన్నారు. ఏపీ హైకోర్టు తీర్పు, గౌరవ న్యాయస్థానముల ఆదేశాల ప్రకారం అక్రమణలు తొలగించడానికి ఈఓ రమాదేవి, ఆలయ సిబ్బంది పురుషోత్తపట్నం గ్రామానికి వెళ్ళారు. అక్కడి అక్రమణదారులు ఈఓ, సిబ్బందిపై దాడి చేయడం జరిగిందన్నారు. ఈఓ, సిబ్బందిపై భూ అక్రమణ దారులు దాడికి పాల్పడటం పై వెంటనే స్పందించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, దేవాదాయ శాఖ కమీషనర్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png