Addam News
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 9:52 pm Posted by : Addam News

అక్షర నీరాజనం పుస్తకావిష్కరణ

 

హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :   వరంగల్‌కు చెందిన కెనడా ప్రవాస భారతీయులు డాక్ట‌ర్‌.నెల్లుట్ల నవీన్ చంద్ర పై 30 మంది రచయితలు రాసిన అక్షర నీరాజనం పుస్తకావిష్కరణ సభ సోమవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ( టిపిఎస్‌కె ) రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కెనడాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న డాక్టర్ నెల్లుట్ల నవీన్ చంద్ర సైంటిస్ట్‌గా, భౌతిక శాస్త్రవేత్తగా కెనడాలో 50 ఏళ్లు ప్రవాస భారతీయుడిగా ఉండి తెలుగు భాషాభిమానం పట్ల ఎనలేని గౌరవంతో ఉన్నారన్నారు. కవిగా సాహితీవేత్తగా తెలుగు రచయితలందర్నీ ఒక వేదిక మీదికి తెచ్చి తెలుగు కవులను రచయితలను, మంచి రచనలను నిరంతరం ప్రోత్సహిస్తూ అనేక పుస్తకాలను ప్రపంచానికి అందిచ్చారన్నారు. Akshara Neerajanam book launchఅన్య భాషలు ఎన్ని నేర్చినా తెలుగును మరిచి పోవద్దంటు చాటి చెప్పారన్నారు. ఆయన ఇటీవల మరణించడం తెలుగు భాషకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తెలుగు కవులందరూ ఆయనకు నివాళిగా అక్షర నీరాజనం అనే పుస్తకాన్ని తీసుకొచ్చి ఆయన తెలుగుకు చేసిన కృషిని అభివర్ణించారు .ఈ కార్యక్రమంలో కొంపల్లి కామేశ్వరరావు, నెల్లుట్ల ఇందుశ్రీ, గోపాలకృష్ణ కృష్ణమూర్తి, ప్రమోద్, శర్మ , లలితా, చండి కిరణ్మయి, రాణి తదితర కవులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png