Addam News
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 11:30 am Posted by : Addam News

HYD-VJA హైవే ప్రయాణికులకు అలర్ట్..

HYD-VJA హైవే ప్రయాణికులకు అలర్ట్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిర్మాణ పనులు, పండుగ రద్దీతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు హైవేపై జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. టోల్ ప్లాజా వద్ద 3 సెకన్లకు ఒక వెహికల్ పాస్ అయ్యేలా ఏర్పాట్లు చేసినా.. రద్దీ తగ్గటం లేదు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

అయితే విజయవాడ హైవేపై ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్ మీదుగా వెళ్తే పంతంగి టోల్‌ప్లాజా వద్ద తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి బదులుగా, హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లడం ఉత్తమమని పోలీసులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా ప్రయాణించే వారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేలోకి ప్రవేశించవచ్చు. ఇది కొంచెం ఎక్కువ దూరమైనప్పటికీ.. ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png