Addam News
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 10:18 am Posted by : Addam News

ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ల వేళలు.. పూర్తి వివరాలు ఇవే..!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది జనవరి 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే వందేభారత్‌తో సహా 25 రైళ్ల వేళల్లో 5 నుంచి 30 నిమిషాల వరకు వ్యత్యాసం ఉండనుంది. ప్రయాణికులు ప్రయాణానికి ముందే రైలు సమయాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. కొత్త ఏడాదిలో ప్రయాణాలకు సిద్ధమవుతున్న రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. 2026 జనవరి 1వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో పలు రైళ్ల రాకపోకల సమయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణలో భాగంగా కొత్త టైమ్‌టేబుల్‌ను రూపొందించినట్లు రైల్వే శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పుల వల్ల ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే పలు కీలక రైళ్ల వేళల్లో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వ్యత్యాసం ఉండనుంది.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20707) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వేళల్లో మార్పు జరిగింది. ప్రస్తుతం ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 5:05 గంటలకు బయల్దేరుతుండగా.. జనవరి 1వ తేదీ నుంచి ఐదు నిమిషాల ముందుగానే అంటే.. ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి ప్రయాణికులు ఈ ఐదు నిమిషాల వ్యత్యాసాన్ని గమనించి స్టేషన్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.

వందే భారత్ మాత్రమే కాకుండా.. నిత్యం వేలాది మంది ప్రయాణించే మరికొన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాలు కూడా మారాయి. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12757): ఈ రైలు ప్రస్తుతం ఉదయం 8:20 గంటలకు బయల్దేరుతుండగా, కొత్త ఏడాది నుంచి 10 నిమిషాల ముందుగా 8:10 గంటలకే ప్రయాణం మొదలవుతుంది కాకతీయ ఎక్స్‌ప్రెస్ (17659): సికింద్రాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్లే ఈ రైలు సమయంలో గణనీయమైన మార్పు ఉంది. ఉదయం 5:25 గంటలకు బదులుగా 5:00 గంటలకే ఇది సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. అంటే ప్రయాణికులు 25 నిమిషాల ముందుగానే సిద్ధంగా ఉండాలి. వీటితో పాటు మొత్తం 25 రైళ్ల వేళల్లో మార్పులు జరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ వెల్లడించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png