అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు కావాలి భాగస్వాములు కావాలి ♦ శ్రీరామ్ వెంకట్
తార్నాక, అక్టోబర్ 15, ( అద్దం న్యూస్ ) : బీజేపీ తార్నాక డివిజన్ ఆధ్వర్యంలో తార్నాక ఎక్స్ రోడ్స్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు విధానం, అవసరమైన పత్రాలు, అర్హతలపై నాయకులు వివరించారు. మహంకాళి జిల్లా బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు...