Addam News
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 11:10 am Posted by : Addam News

ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ కొత్త సినిమా..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అల్లరి నరేష్ నటించిన ’12ఏ రైల్వే కాలనీ’ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉన్న ఈ చిత్రం, ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘12ఏ రైల్వే కాలనీ’. ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, గెటప్‌ శ్రీను, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండా ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా ఈరోజు (డిసెంబర్ 10) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. థియేటర్లలో పెద్దగా ఆడలేదు కాబట్టి, ఓటీటీలో ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png