భోలక్‌పూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ సంజీవయ్యనగర్ బస్తీలో డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర నాయకుడు బిజ్జి కనకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లవెల్లి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు తదితరులు పాల్గొన్నారు.