జలమండలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
హైదరాబాద్, అద్దం న్యూస్ : జలమండలిలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జలమండలి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం న ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ... దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన కొన్ని వర్గాల...