Addam News
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 12:45 am Posted by : Addam News

అమిత్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి – తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 23, అద్దం న్యూస్ :  ఇండియా కూటమి నుంచి ఉప రాష్ట్రపతిగా నిలబెట్టిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, మాజీ తెలంగాణ గ్రామ పంచాయతి ట్రిబ్యునల్‌ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా నక్సల్‌ అనుకూలుడని, నక్సలిజానికి మద్దత్తుదారని, 2011 లో సల్వాజుడం జడ్జిమెంట్‌ ఇచ్చారన్నారని అమిత్ షా అనడం సరైన పద్ధతి కాదన్నారు. రాజకీయ లబ్దికోసం విజ్ఞతా రహితంగా, కోర్టు తీర్పును, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిపై అమిత్ షా వ్యక్తిగత నిందలు ఆపాదించడము, ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందనే వస్తుందనే కనీస స్పృహ లేకుండ మాట్లాడడం బాధాకరమన్నారు. తక్షణమే అమిత్ షా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షం న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను అవమానించినట్లే అవుతుందన్నారు.


.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png