Addam News
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 11:43 am Posted by : Addam News

Florida: కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనక నుంచి ఢీకొన్న ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకొంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్‌ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్‌-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్‌, ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వీరు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి రావడానికి గల కారణాలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇంజన్ వైఫల్యం లేదా ఇతర సాంకేతిక లోపాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అత్యవసర ల్యాండింగ్ కోసం విమానం నేరుగా రద్దీగా ఉండే హైవేపై దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

https://x.com/MikeWESH_2/status/1998487716061745227?s=20

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png