Florida: కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనక నుంచి ఢీకొన్న ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకొంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్‌ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్‌-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్‌, ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వీరు సురక్షితంగా బయటపడినట్లు...