Addam News
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 12:12 pm Posted by : Addam News

Anasuya: మరోసారి రెచ్చిపోయిన అనసూయ..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: శివాజీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అనసూయ (Anasuya) మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేసింది. “నేను చాలా సందర్భాల్లో హద్దులు దాటకుండా మౌనంగా వచ్చాను. మీ మద్దతు నాకు అవసరం లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు” అంటూ ఆమె (Anasuya) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అటు శివాజీ, ఇటు అనసూయ ఇద్దరూ ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఒక వర్గం అనసూయ వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుంటే, మరో వర్గం శివాజీ మాటల్లోని ఉద్దేశాన్ని సమర్థిస్తోంది.

తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశించి అనసూయ (Anasuya) తాజాగా మరో పోస్ట్ పెట్టింది. అందులో కొంతమంది వ్యక్తులు, బాధ్యతారహిత మీడియా సంస్థలు తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ ప్రజలను రెచ్చగొట్టే కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. ఇవన్నీ సాధారణ ప్రజలను అయోమయానికి గురిచేయడానికే అని ఆమె (Anasuya) స్పష్టం చేసింది. తన మాటల అర్థాన్ని మార్చి, మోసపూరిత నారేటివ్‌ను ప్రచారం చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘కొంతమంది రాబందుల్లాంటి వ్యక్తులు.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థలు.. స్మార్ట్‌ఫోన్‌లు, మైకులు చేతబట్టి తిరిగే కొంతమంది సామాజిక అక్షరాస్యత లేని వారు.. నా మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, తమకు అనుకూలంగా మోసపూరిత కథనాలను సృష్టించారు. ఈ కథనాలన్నీ ప్రజలను రెచ్చగొట్టడం, అయోమయానికి గురిచేయడం, సాధారణ పురుషులు-మహిళలను తప్పుదోవ పట్టించడం కోసమే రూపొందించబడ్డవి’ అంటూ అనసూయ (Anasuya) ఘాటుగా పోస్ట్ చేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png