ప్రాచీన కళలను కాపాడుకోవాలి
సిటీ కల్చరల్, అద్దం న్యూస్ : ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వసంతోత్సవం పేరిట కూచిపూడి నృత్య ప్రదర్శనలు కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంస్కార భారతి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కేవివి శర్మ, సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచలన స్కూల్...