Addam News
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 3:01 am Posted by : Addam News

జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాల్లో అందెశ్రీ నిప్పుల వాగు పుస్తక ఆవిష్క‌ర‌ణ‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 15, అద్దం న్యూస్ :  58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములో భాగంగా శ‌నివారం 2 వ రోజు చిక్క‌డ‌ప‌ల్లి హైద‌రాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైద‌రాబాద్‌ అడిషనల్ కలెక్టర్ పలని కధిరవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మ‌న్‌ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ ల‌తో క‌లిసి బుక్ ఎగ్జిబిష‌న్‌ను సంద‌ర్శించారు. తెలంగాణ రచయిత దివంగ‌త అందెశ్రీ ర‌చించిన నిప్పుల వాగు పుస్తకాన్ని బుక్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… అందెశ్రీ రచనలు పాటతో తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో తెలంగాణ ప్రజలను మేల్కొల్పిందని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, బి.ప్రతిభా రెడ్డి, హైద‌రాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు అవినాష్, వెంకటేశ్వర రెడ్డి, బొల్లం మహేందర్, హరిబాబు, శంకర్, జంగారెడ్డి, పిడి.మ‌హేష్‌ గౌడ్‌, ఈశ్వర్, రాజేష్, శ్రీకాంత్, నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వివిధ శాఖా గ్రంథాలయ ఉద్యోగులు, హైద‌రాబాద్‌ నగర గ్రంథాలయ సంస్థ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png