జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో అందెశ్రీ నిప్పుల వాగు పుస్తక ఆవిష్కరణ
హైదరాబాద్, నవంబర్ 15, అద్దం న్యూస్ : 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములో భాగంగా శనివారం 2 వ రోజు చిక్కడపల్లి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ పలని కధిరవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ లతో కలిసి బుక్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. తెలంగాణ రచయిత దివంగత అందెశ్రీ రచించిన నిప్పుల వాగు పుస్తకాన్ని...