అందెశ్రీ మృతి తెలంగాణ సాహిత్య లోకానికి అపారమైన నష్టం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, నవంబర్ 10, అద్దం న్యూస్ : ప్రఖ్యాత తెలుగు కవి, గేయ రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ" సృష్టికర్త అందెశ్రీ మృతి తెలంగాణ సాహిత్య లోకానికి అపారమైన నష్టం, తీరని లోటు అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ప్రఖ్యాత తెలుగు కవి, గేయ రచయిత, అందెశ్రీ ( 64 ) సోమవారం గుండె పోటుతో హైదరాబాద్...