అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జపాన్‌లో వరుస భూకంపాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పసిఫిక్ తీరప్రాంతంలో సునామీ అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడొచ్చని హెచ్చరించారు. కుజి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. కాగా నాలుగు రోజుల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపానికి పలు ఇళ్లు బీటలు వారగా 50 మంది గాయపడ్డారు.
ఇది ఇలా ఉండగా..గత రెండు, మూడు రోజులో జపాన్లో 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో ప్రజలు వణికిపోయారు. ఇళ్లు, భవనాలు, మెట్రోస్టేషన్లు ఊగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలుచోట్ల నివాసాలకు డ్యామేజీ జరగగా కొందరికి గాయాలయ్యాయి. ఎక్కడా ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. న్యూక్లియర్ ప్లాంట్లకూ ఎలాంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. నిన్న జారీచేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png