Addam News
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 12:49 am Posted by : Addam News

మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని ని స‌న్మానించిన అపార్ట్‌మెంట్స్ వాసులు

మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని ని స‌న్మానించిన అపార్ట్‌మెంట్స్ వాసులు

ముషీరాబాద్‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :      ప్రత్యేక చొరవతో జరిపిన అభివృద్ధికి కృతజ్ఞతగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని ని ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ స‌మీపంలోని భాగ్యనగర్ కాంప్లెక్స్, సుదర్శన్ ఎలైట్ అపార్ట్‌మెంట్ వాసులు శ‌నివారం ఘ‌నంగా స‌న్మానించారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ నిర్మాణం కాకముందు నుండి సుమారు గత 25 సంవత్సరాలుగా ఏ నాయకులు పట్టించుకోని వీధిని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావ‌ని ప్రత్యేక దృష్టి వహించి చేపట్టిన అభివృద్ధి చర్యల్లో భాగంగా నూతన సిసి రోడ్డు నిర్మాణం, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెందిందని అపార్ట్‌మెంట్స్ వాసులు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికుల ఫిర్యాదు మేరకు జిహెచ్ఎంసి నుంచి రూ.22 లక్షల నిధులతో నూతన సిసి రోడ్డు అభివృద్ధి పనులు జరిపించామ‌ని తెలిపారు. ప్రస్తుతం వీధిలో రోజు రాత్రిళ్ళు పోకిరీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అపార్ట్‌మెంట్స్ వాసుల ఫిర్యాదు మేరకు సంబంధిత చిక్కడపల్లి పోలీసు అధికారులతో మాట్లాడామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నేతలు ఎం.ఉమేష్, సాయి కుమార్, నీరజ్, జ్ఞానేశ్వర్, సాయి తరుణ్, భాగ్యనగర్ కాంప్లెక్స్, సుదర్శన్ ఎలైట్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png