Addam News
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 11:00 pm Posted by : Addam News

శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర ర్యాలీ కోసం ద‌ర‌ఖాస్తు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏప్రిల్ 12వ తేదీన నిర్వ‌హించ‌నున్న శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర ర్యాలీకి అనుమ‌తి, మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి ప్ర‌తినిధి బృందం కోరింది. ఈ మేర‌కు బుధ‌వారం ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబును శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్, రాజు, గడ్డం నవీన్, రామకృష్ణ, రామ్ రెడ్డి, రవి చారి, అరుణ్, రాకేష్, సత్యనారాయణ, రాజ్ కుమార్ త‌దిత‌రులు క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ… గ‌త 16 సంవ‌త్స‌రాలుగా హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ర్యాలీని నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఏప్రిల్ 12వ తేదీన సాయంత్రం 6 హ‌నుమాన్ విజ‌య‌యాత్ర అడిక్‌మెట్ ఆభ‌యాంజ‌నేయ‌స్వామి దేవాల‌యం నుంచి రాంన‌గ‌ర్ చౌర‌స్తా, ద‌యారామార్కెట్ దేవాల‌యం, బొమ్మ‌ల‌గుడి, జెమిస్తాన్‌పూర్‌, బ్లూ బ‌ర్డ్స్ స్కూల్‌, రిసాల, వైట్‌హౌస్ హోట‌ల్ నుంచి ర్యాలీని నిర్వ‌హించి హ‌రిన‌గ‌ర్ ప్లేగ్రౌండ్‌లో ముగుస్తుంద‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png