గ్రామీణాభివృద్ధి పథకాలకు ( ఆర్ఐడిఎఫ్ ) కింద తగిన విధంగా సహకరించాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పథకాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (RIDF) కింద తగిన విధంగా సహకరించాలని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వి ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు.తక్కువ వడ్డీకి రుణాలను అందజేయాలని కోరారు. నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వీ (Shaji Krishnan V) తో పాటు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) బి.ఉదయ్ భాస్కర్,  బ్యాంకు ప్రతినిధుల...